Posts

Showing posts from September, 2022

నన్ను నటిగా చేసింది ఆ సినిమానే అంటున్న natural beauty...

Image
భానుమతి హైబ్రీడ్ పిల్ల ఒక్కటే పీస్ అంటూ ఫిదా  సినిమాతో తెలుగు వారికి దగ్గిరయిన అందాల తార సాయిపల్లవి. విలక్షణ మైన నటనతో తెలంగాణ యాసలో చక్కటి అభినయంతో దక్షిణాదిన తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకుంది. ఏ పాత్ర పోషించిన అందులో చక్కగా ఒదిగిపోయే లక్షణం ఆమెది.  సాయి పల్లవి గారికి చిన్నతనం నుండి కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం.ఈమెకు ఒక చెల్లెలు కూడా ఉన్నారు. వీరిద్దరూ కవలలు.ఈమె తమిళనాడు దగ్గర ఒక చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుండి కూడా స్కూల్ లో చిన్న చిన్న డాన్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనేవారు. టీవీ లో నిర్వహించే మిలో ఎవరు ప్రభుదేవా, డీ వంటి ప్రోగ్రామ్స్ లో కూడా పార్టిసిపేట్ చేశారు.వాటిలో విజేత కాలేక పోయిన అదే ఆమెకు నటిగా మారేందుకు అవకాశాలను ఇచ్చింది.  సాయిపల్లవి తండ్రి గారికి అది ఇష్టం లేక చదువు ఎక్కడ పాడవుతుందో అనే భయంతో ఆమెను డాక్టర్ చదువుకోసం జార్జియా పంపించేశారు.అక్కడ 4సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివి తిరిగి వచ్చారు. అప్పుడే ఆమెకు మలయాళం లో ప్రేమమ్ అనే మూవీ ఆఫర్ వచ్చింది. అది కాస్త సూపర్ హిట్టు   కావడంతో  శేకర్కమ్ములదర్శకత్వంలోవచ్చినఫిదామూవీలోనటించారు.అప్పటికి తమిళ్ లో చేసినా సిని

నటి వాణిశ్రీ గారి జీవితం లో జరగిన ఈ సంఘటనే ఆమె సినీరంగ ప్రయాణానికి ఆటంకం అయ్యిందా?

Image
నటి వాణిశ్రీ గారి జీవితం లో జరగిన ఈ సంఘటనే ఆమె సినీరంగ ప్రయాణానికి ఆటంకం అయ్యిందా? మహానటి సావిత్రి గారి తర్వాత అంతంటి అధ్బుతం గా నటించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం వాణిశ్రీ  గారు మాత్రమే అని చెప్పవచ్చు. అందంతో నే కాక తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసే గొప్ప నటనా చాతుర్యం కలిగిన వ్యక్తి ఆవిడ.  కట్టు,బొట్టు చూసేందుకు చక్కటి రూపం ఆమె సొంతం . వాణిశ్రీ గారు 1948 ఆగస్ట్ 3 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నెల్లూరు లో జన్మించారు.ఆమె నెల్లూరులో 9వ తరగతి వరకు చదువుకున్నారు. తరువాత తండ్రి గారికి అనారోగ్యం కారణంగా ముంబయి వచ్చేశారు.వారి అక్కతో పాటు చదువుకుంటూ నాట్యం నేర్చుకునే వారు. రక్త కన్నీరు, చిల్లర కొట్టు చిట్టెమ్మ లాంటి నాటకాలలో వేషాలు వేశారు. అలా ప్రదర్శించే సమయంలోనే సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి.  ముందుగా ఆమె కన్నడ,తమిళ్ భాషలలో కదా నాయికగా నటించిన తెలుగులో చిన్న చిన్న పాత్రలు చేసేవారు. సావిత్రి గారు చేయవలసిన ఒక సినిమా ఆమె చేయలేక పోవడంతో ఆ అవకాశం వాణిశ్రీ గారికి వచ్చిందట. ఆ సినిమా హిట్ కావడంతో అప్పటి నుండి ఆమె తిరిగి చూడలేదు.వాణిశ్రీ గారిని ఒక సినిమా లో కొ

ప్రభాస్ గారి ఇంట తీరని విషాదం

Image
ప్రభాస్ గారి ఇంట తీరని విషాదం ప్రముఖ నిర్మాత నాటి తరం హీరో అయినటువంటి కృష్ణం రాజు గారు తుది శ్వాస విడిచారు.రెబెల్ స్టార్ గా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన నటులు అయిన కృష్ణం రాజు ఇక లేరు.హైదరాబాద్ లోని ఆదివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతం లో తనువు చాలించారు.కృష్ణం రాజు గారికి బార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.ఆయన వయస్సు 83 సంవత్సరాలు.కృష్ణం రాజు గారు కేంద్ర మంత్రి గా కూడా పని చేశారు.గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.సోమవారం హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు అభిమానులు విషాదం వ్యక్తం చేశారు.ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ నిర్మాతలు, నటులు పేర్కొన్నారు.బాహుబలి సినిమాలో నటించిన ప్రముఖ నటుడు ప్రభాస్ గారు కృష్ణం రాజు గారి తమ్ముడి కుమారుడే. ఇద్దరు కలసి కొన్ని సినిమాలలో కూడా నటించారు. రీసెంట్ గా వచ్చిన రాదేశ్యాం లో కూడా ఇద్దరు నటించారు.ఇదే ఆయన ఆకరి సినిమా కావడం గమనర్హం. . గత ఐదు దశాబ్దాలకు పైగా ఆయన ఎన్నో మంచి పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారు కృష

Telugu cinima muchatlu

Image
కొణిదెల శివశంకర వరప్రసాద్. ఈ పేరు వినని వారు అంటూ ఏ ఒక్కరూ ఉండరు.ముఖ్యంగా తెలుగు నాట ఎంతో ప్రసిద్ధి కలిగింది. అయితే ఆయనే చిరంజీవి గా తెలుగు సినిమా ప్రపంచాన్ని ఒక ఊపు ఉపారు. తనకున్న అందం, అభినయం తోపాటు సరికొత్త డైలాగ్స్ తో, కొత్త స్టెప్పులతో హీరో అంటే ఇలాగే ఉంటడేమో అని చూపించారు. చిరంజీవి గారు మొగల్తూరు లోని ఆయన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు. ఎన్నో ఆటు పొట్లు ఎదుర్కుని తనకు ఇష్టమైన కళలో మెళుకువలు నేర్చుకుని ఒక పక్క చదువుకుంటూ మరో ప్రక్క ఆక్టింగ్ నేర్చుకుంటూ తన ప్రయాణం సాగించారు.ఆయన తండ్రి వెంకట్రావు గారు మొగల్తూరు లోని కానిస్టేబులు గా పని చేసేవారు. ఆయనతల్లి అంజన దేవి గారు.ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు,ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. అల్లు రామాలింగయ్య గారి కుమార్తె అయిన సురేఖా గారి తో ఆయనకు వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తన సినీ వారసత్వాన్ని కుమారుడు అందిపుచ్చుకుని తనదైన శైలిలో హీరో గా రాణిస్తున్నారు. కుమార్తెలకు వివాహం జరిపించారు. సినిమారంగం లోనే కాక రాజకీయాలలో  కూడ తన పాల్గొన్నారు అది అంత కలిసి రాకపోవడం తో అది విరమించుకుని తిరిగి సినిమా లో కొనసాగుతున్నారు.ప్రజలకు ఏద