నటి వాణిశ్రీ గారి జీవితం లో జరగిన ఈ సంఘటనే ఆమె సినీరంగ ప్రయాణానికి ఆటంకం అయ్యిందా?

నటి వాణిశ్రీ గారి జీవితం లో జరగిన ఈ సంఘటనే ఆమె సినీరంగ ప్రయాణానికి ఆటంకం అయ్యిందా?

మహానటి సావిత్రి గారి తర్వాత అంతంటి అధ్బుతం గా నటించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం వాణిశ్రీ  గారు మాత్రమే అని చెప్పవచ్చు. అందంతో నే కాక తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసే గొప్ప నటనా చాతుర్యం కలిగిన వ్యక్తి ఆవిడ.  కట్టు,బొట్టు చూసేందుకు చక్కటి రూపం ఆమె సొంతం .

వాణిశ్రీ గారు 1948 ఆగస్ట్ 3 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నెల్లూరు లో జన్మించారు.ఆమె నెల్లూరులో 9వ తరగతి వరకు చదువుకున్నారు. తరువాత తండ్రి గారికి అనారోగ్యం కారణంగా ముంబయి వచ్చేశారు.వారి అక్కతో పాటు చదువుకుంటూ నాట్యం నేర్చుకునే వారు. రక్త కన్నీరు, చిల్లర కొట్టు చిట్టెమ్మ లాంటి నాటకాలలో వేషాలు వేశారు. అలా ప్రదర్శించే సమయంలోనే సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. 

ముందుగా ఆమె కన్నడ,తమిళ్ భాషలలో కదా నాయికగా నటించిన తెలుగులో చిన్న చిన్న పాత్రలు చేసేవారు. సావిత్రి గారు చేయవలసిన ఒక సినిమా ఆమె చేయలేక పోవడంతో ఆ అవకాశం వాణిశ్రీ గారికి వచ్చిందట. ఆ సినిమా హిట్ కావడంతో అప్పటి నుండి ఆమె తిరిగి చూడలేదు.వాణిశ్రీ గారిని ఒక సినిమా లో కొంచెం అభ్యంతరకర సన్నివేశాలు చేయవలసి వచ్చిందని అవి కచ్చితంగా  చేయలేనని చెప్పడం తో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయని కూడా ఆమె ఒక interview లో తెలియజేశారు.

తరువాత వాణిశ్రీ గారికి ఒక డాక్టర్ తో వివాహాం జరిపించారు.ఆమెకు ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు.వారుకూడా డాక్టర్లే.వారి అల్లుడు కూడా ఒక డాక్టర్ అని అన్నారు.చిన్న వయస్సులో నే తండ్రిని పోగొట్టుకుని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ స్థాయికి ఎదిగారు.సొంతవారు అనుకున్న అక్క, భావే తనను మోసంచేస్తే కోర్టు మెట్లు కుడా ఎక్కి దిగారు.అయిన నిరుచ్చాహ పడకుండా మళ్ళీ సినిమాలలో నటించి బాధ పెట్టిన వారినే ఆపదలో ఆదుకున్నారు.అంతటి గొప్ప వ్యక్తి వాణిశ్రీ గారు.మంచి మనసు కలిగిన వారికి ఎప్పటికీ మంచే జరుగుతుంది.

Comments

Popular posts from this blog

Telugu cinima muchatlu