Posts

Showing posts with the label నటి వాణిశ్రీ గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు

నటి వాణిశ్రీ గారి జీవితం లో జరగిన ఈ సంఘటనే ఆమె సినీరంగ ప్రయాణానికి ఆటంకం అయ్యిందా?

Image
నటి వాణిశ్రీ గారి జీవితం లో జరగిన ఈ సంఘటనే ఆమె సినీరంగ ప్రయాణానికి ఆటంకం అయ్యిందా? మహానటి సావిత్రి గారి తర్వాత అంతంటి అధ్బుతం గా నటించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం వాణిశ్రీ  గారు మాత్రమే అని చెప్పవచ్చు. అందంతో నే కాక తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసే గొప్ప నటనా చాతుర్యం కలిగిన వ్యక్తి ఆవిడ.  కట్టు,బొట్టు చూసేందుకు చక్కటి రూపం ఆమె సొంతం . వాణిశ్రీ గారు 1948 ఆగస్ట్ 3 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నెల్లూరు లో జన్మించారు.ఆమె నెల్లూరులో 9వ తరగతి వరకు చదువుకున్నారు. తరువాత తండ్రి గారికి అనారోగ్యం కారణంగా ముంబయి వచ్చేశారు.వారి అక్కతో పాటు చదువుకుంటూ నాట్యం నేర్చుకునే వారు. రక్త కన్నీరు, చిల్లర కొట్టు చిట్టెమ్మ లాంటి నాటకాలలో వేషాలు వేశారు. అలా ప్రదర్శించే సమయంలోనే సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి.  ముందుగా ఆమె కన్నడ,తమిళ్ భాషలలో కదా నాయికగా నటించిన తెలుగులో చిన్న చిన్న పాత్రలు చేసేవారు. సావిత్రి గారు చేయవలసిన ఒక సినిమా ఆమె చేయలేక పోవడంతో ఆ అవకాశం వాణిశ్రీ గారికి వచ్చిందట. ఆ సినిమా హిట్ కావడంతో అప్పటి నుండి ఆమె తిరిగి చూడలేదు.వాణిశ్రీ గారిని ఒక సినిమా లో కొ