Telugu cinima muchatlu

కొణిదెల శివశంకర వరప్రసాద్. ఈ పేరు వినని వారు అంటూ ఏ ఒక్కరూ ఉండరు.ముఖ్యంగా తెలుగు నాట ఎంతో ప్రసిద్ధి కలిగింది. అయితే ఆయనే చిరంజీవి గా తెలుగు సినిమా ప్రపంచాన్ని ఒక ఊపు ఉపారు. తనకున్న అందం, అభినయం తోపాటు సరికొత్త డైలాగ్స్ తో, కొత్త స్టెప్పులతో హీరో అంటే ఇలాగే ఉంటడేమో అని చూపించారు. చిరంజీవి గారు మొగల్తూరు లోని ఆయన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు. ఎన్నో ఆటు పొట్లు ఎదుర్కుని తనకు ఇష్టమైన కళలో మెళుకువలు నేర్చుకుని ఒక పక్క చదువుకుంటూ మరో ప్రక్క ఆక్టింగ్ నేర్చుకుంటూ తన ప్రయాణం సాగించారు.ఆయన తండ్రి వెంకట్రావు గారు మొగల్తూరు లోని కానిస్టేబులు గా పని చేసేవారు. ఆయనతల్లి అంజన దేవి గారు.ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు,ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. అల్లు రామాలింగయ్య గారి కుమార్తె అయిన సురేఖా గారి తో ఆయనకు వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తన సినీ వారసత్వాన్ని కుమారుడు అందిపుచ్చుకుని తనదైన శైలిలో హీరో గా రాణిస్తున్నారు. కుమార్తెలకు వివాహం జరిపించారు. సినిమారంగం లోనే కాక రాజకీయాలలో  కూడ తన పాల్గొన్నారు అది అంత కలిసి రాకపోవడం తో అది విరమించుకుని తిరిగి సినిమా లో కొనసాగుతున్నారు.ప్రజలకు ఏదోకటి మంచి చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు మరియు eye donation శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఎన్నో వేల మందికి  ప్రాణదానం చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఇలాంటి వారి నుండి మనం చాలా నేర్చుకోవాలి. సాయం కోరిన వారికి ఆలోచించకుండా తమ వంతు సాయం చేసే గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ పదిమందిని నవ్విస్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

Comments